అమ‌ర్‌నాథ్‌లో పెను విషాదం..

58
- Advertisement -

అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వ‌ర్షాల‌తో జ‌మ్మూలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించ‌డంతో 15 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ప‌దుల సంఖ్య‌లో గల్లంతుకాగా మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఎన్డీఆర్ఎఫ్ వెంట‌నే రంగంలోకి దిగింది. వ‌ర‌ద బీభ‌త్సం నుంచి 15 వేల మంది యాత్రికుల‌ను సుర‌క్షితంగా కాపాడారు. గుహ వ‌ద్ద నుంచి పంజ్‌త‌ర్ని వ‌ర‌కు ఐటీబీపీ జ‌వాన్లు బందోబ‌స్తు క‌ల్పించారు.

మ‌రోవైపు ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌లో అమ‌ర్‌నాథ్ యాత్రికుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. గ‌ల్లంతైన వారి ఆచూకీ కోసం మౌంటెన్ రెస్క్యూ టీమ్స్ త‌నిఖీలు చేస్తున్నాయి. అమ‌ర్‌నాథ్ గుహ వ‌ద్ద రెస్క్యూ ఆప‌రేష‌న్ నిమిత్తం రెండు రెస్క్యూ శున‌కాల‌ను హెలికాప్ట‌ర్‌లో త‌ర‌లించారు.

- Advertisement -