రివ్యూ: అమర్ అక్బర్ అంటోని

453
Amar Akbar Anthony
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించగా కామెడీ చిత్రాల ఫేమ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కింది. వరుస పరాజయాలతో డీలా పడ్డ శ్రీను వైట్ల ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో సినిమాను తెరకెక్కించారు. గతంలో రవితేజ-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన సినిమాలు ఘనవిజయం సాధించగా ఈ సినిమా ఎలా ఉంది..?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. యుఎస్‌లో బిజినెస్‌ ప్రారంభించి బిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తమ కంపెనీలో కొత్తవారిని భాగస్వాములుగా చేర్చుకుంటారు. కొత్తగా కంపెనీలోకి వచ్చిన వీరు ఆనంద్,సంజయ్‌లను హతం చేయడానికి ప్లాన్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఈ దాడి నుంచి తప్పించుకున్న అమర్,ఐశ్వర్యలు ఏం చేశారు..?తమ తల్లిదండ్రులను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకున్నారు..?అసలు ఈ కథకి అక్బర్,ఆంటొనిలకు సంబంధం ఏంటనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రవితేజ నటన,నిర్మాణ విలువలు. రవితేజ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్‌ పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజకు జోడిగా ఇలియానా ఆకట్టుకుంది. తన నటన,గ్లామర్‌తో సినిమాకు మరింత అందాన్ని తెచ్చింది. విలక్షణ నటుడు షాయాజీ షిండే తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి,సత్య, రఘుబాబు, గిరి, జయప్రకాష్‌ రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,కామెడీ లేకపోవడం,స్క్రీన్ ప్లే. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను శ్రీను వైట్ల అందుకోలేకపోయాడు. రివేంజ్‌ డ్రామా కథకు న్యూయార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. కామెడీ లేకపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. తమన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించినా నేపథ్య సంగీతం సూపర్భ్. సినిమాకు మరో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. ప్రతి సన్నివేశం కలర్‌ ఫుల్‌గా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి.

తీర్పు:

రాజా ది గ్రేట్‌ సినిమా తరువాత మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కొంతకాలంగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అమర్‌ అక్బర్ ఆంటొని. రవితేజ నటన సినిమాకు ప్లస్ కాగా కథ,కామెడీ లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్స్‌. రవితేజ తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ అమర్ అక్బర్ ఆంటోని.

విడుదల తేదీ:16/11/18
రేటింగ్: 2.75/5
నటీనటులు : రవితేజ, ఇలియానా
సంగీతం : ఎస్‌. తమన్‌
నిర్మాత : నవీన్‌ ఎర్నేని
దర్శకత్వం : శ్రీను వైట్ల

- Advertisement -