కొత్త జంటల ముచ్చట్లు వైరల్

52
- Advertisement -

సోషల్ మీడియాలో ప్రస్తుతం కొత్త జంటల ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, ఎవరు ఆ కొత్త జంటలు ?, ఏమిటి ఆ విశేషాలు ఏమిటో చూద్దాం రండి. ముందుగా హీరోయిన్ అమలాపాల్ విషయానికి వస్తే.. ఆమె తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే, ప్రియుడు జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమలాపాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసి ఆమె.. నీతో కలిపి 1+1=3 కాబోతున్నాం అని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. కాగా, వీరి పెళ్లి గత ఏడాది నవంబర్ 5న జరిగిన విషయం తెలిసిందే.

అలాగే, మరోసారి సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం అదితి చేసిన పోస్టే. న్యూఇయర్ వేళ అభిమానులకు విషెస్ చెబుతూ సిద్ధార్థ్ తో దిగిన ఫోటోను అదితి ఇన్‌స్టాలో షేర్ చేసింది. వీరిద్దరి ఫోటోలు చూసిన నెటిజన్లు పెళ్లి చేసుకోబోతున్న మరో జంట అని వార్తలు వైరల్ చేస్తున్నారు. కాగా, ‘మహాసముద్రం’ మూవీ టైంలో సిద్ధార్థ్, అదితి ప్రేమలో పడ్డారని సమాచారం. మొత్తానికి వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా, బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టికొచ్చాక దివికి క్రేజ్ బాగా పెరిగింది. వెబ్‌ సిరీస్‌ ల‌తో పాటూ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా లైఫ్ ను గ‌డుపుతున్న దివి, సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దివి ఇన్‌ స్టాలో టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్‌లో న‌డుము అందాల‌తో పాటూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. దివి షేర్ చేసిన‌ ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఐతే, దివి కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఆమె ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందట. మరి ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Also Read:బెల్లంకొండ సాయి శ్రీనివాస్@ ‘టైసన్ నాయుడు’

- Advertisement -