సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో/హీరోయిన్స్ పెళ్ళి చేసుకొని ఆ తర్వాత విడాకుల బాట పట్టడం మామూలే అయిపోయింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైభంగా పెళ్ళి చేసుకున్న సినీ జంట అమలాపాల్-విజయ్. వీరు దాదాపు 3 సంవత్సరాలుగా ప్రేమించుకొని, చివరికి పెళ్ళి చేసుకున్నారు. అలా పెళ్ళి చేసుకున్న వీరు విడాకుల బాట పట్టడానికి కూడా పెద్దగా సమయం పట్టేలేదు. వీరు విడాకులు తీసుకుంటుంన్నారన్న వార్త బయటపడగానే.. ఇండస్ట్రీలోని చాలా మంది షాక్ అయ్యారు. ఇక విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన వీరికి తాజాగా కోర్టు విడాకులను మంజూరుచేసిన విషయం తెలిసిందే.
జ్యూడీషియల్ సెపరేషన్లో భాగంగా గత ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్న వీరికి.. విడాకులు మంజూరయ్యాయి. 2014 జూన్ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే విడాకుల వరకూ వెళ్ళాల్సిన సమస్యలు వీరి మధ్య ఏమున్నాయనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి కూడా. అయితే.. పెళ్ళి తరువాత అమలాపాల్ సినిమాలకి దూరంగా ఉండాలన్నది విజయ్ తల్లిదండ్రుల నిబంధన.
అత్తింటి వారి నిబంధనను అమలాపాల్ వ్యతిరేకించటంతో పరిస్థితి విడాకుల వరకూ వచ్చింది. ఇదిలా ఉంటే…ప్రస్తుతం అమలాపాల్ మాత్రం తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది. తను ఎప్పుడైతే సినిమాలపై ఫోకస్ పెట్టిందో…అప్పటి నుండి ఈ అమ్మడుకి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలాపాల్ చేతిలో దాదాపు అరడజనుకి పైగా ఆఫర్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి తరువాతే అమలాపాల్ కెరీర్ స్పీడ్ అందుకుందని అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో అమలాపాల్ వెంటపడుతున్నాడని కొలీవుడ్ లో టాక్.
గత కొద్ది నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ లో మాత్రం ఈ విషయానికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఓ ప్రవేట్ ఫంక్షన్ కి వచ్చిన విజయ్ కి అమలాపాల్ మరో యంగ్ హీరోతో కనిపించిందట. అలా వేరే హీరోతో అమలాపాల్ కలిసి రావటం చూసి విజయ్ షాకయ్యాడంటూ అక్కడున్నవాళ్ళ అభిప్రాయం. అయితే ఆ సమయంలో మాజీ భర్త పక్కన ఉండగానే అమలాపాల్ మరో ప్రియుడితో కనిపించటం అనేది అక్కడ ఉన్నవారికి సైతం కాస్త కొత్తగా అనిపించిందని అంటున్నారు.