ల‌వ్ అంటే నాన్ సెన్స్.. ‘అల్లుడు అదుర్స్‌’ ట్రైల‌ర్‌..

214
Alludu Adhurs Trailer
- Advertisement -

‘రాక్ష‌సుడు’ లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. బేసిగ్గా కొన్ని అనివార్య‌మైన కార‌ణాల వ‌ల్ల అమ్మాయి అంటే నాకు ప‌డ‌దు సార్‌. ల‌వ్ అంటే నాన్ సెన్స్ అని ఫీల‌య్యేవాడిని. అలాంటిది మీ డాట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌తో నా కారెక్ట‌ర్ మొత్తం ట‌ర్న్ అయిపోయిందంటూ హీరో డైలాగ్స్ తో షురూ అయ్యే ట్రైల‌ర్..ల‌వ్‌, యాక్ష‌న్ , కామెడీ స‌న్నివేశాల‌తో సాగుతూ అల‌రిస్తోంది. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ , న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

- Advertisement -