క్రాప్ బుకింగ్‌లో తెలంగాణ రికార్డ్- నిరంజన్ రెడ్డి

28
Ministers Niranjan Reddy

అబిడ్స్‌లోని రెడ్డీస్ హాస్టల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం 2021 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సమావేశానికి నాతో పాటు వచ్చిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సంఘం ప్రతినిధులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపరు. ఆందోళనలు అవసరం లేదు త్వరలోనే వ్యవసాయ శాఖలో ప్రమోషన్‌లు వస్తాయని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

క్లస్టర్ లకు విఆర్ఎ అటాచ్ చేస్తే బాగుంటుంది మేము ఆలోచన చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇతర డిపార్ట్మెంట్‌లో వర్క్ విషయంలో పని చేస్తున్నారు అని చెప్పారు దాన్ని సీఎస్ దృష్టికి తీసుకొనివేళ్లాను.మీకు ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు. క్రాప్ బుకింగ్ చాలా సమయం ఉంది అలాంటి విషయంలో ఏవో లు ఎఈఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి నమోదు చేయాలి. క్రాప్ బుకింగ్‌లో దేశంలో తెలంగాణ రాష్ట్రం రికార్డ్ అది మన వ్యవసాయ శాఖకే దక్కుతుందన్నారు. క్రాప్ బుకింగ్‌తో వ్యవసాయ శాఖకు చాలా ముఖ్యం దీన్ని టాప్ ప్రియార్టీ తీసుకోవాలని కోరుతున్న. బదిలీలు మొత్తం ప్రభుత్వంలో భాగం కాబట్టి దీన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగుతుంది.

వ్యవసాయ శాఖ అధికారులకు వాహనాల విషయం ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్ళాను.ఆర్ధిక శాఖ కొంత ఒత్తిళ్లకు గురవుతుంది. వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల నియామకాలను చేయాలి అని ఇప్పటికే కోరాను. రైతు వేదిక లకు మెంటనెన్స్ చేయాలని కోరారు.రైతు వేదికలు రైతు శిక్ష కేంద్రాలుగానే ఉండాలి. సంక్రాంతి పండుగ తరువాత రైతులకు శిక్షణ ఉంటుంది. మీ సమస్యలు పరిష్కరించాలని కోరారు దానికి త్వరలోనే పరిస్కరం ఉంటుంది. రానున్న రోజుల్లో వ్యవసాయ శాఖ మరింత రెట్టింపు తో ముందుకి పోవాల్సి ఉంటుంది. భారత దేశంలో మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ముందు వరుసలో ఉంది. దానికి మీరు చేసిన సహకారం మరువలేనిది.

గతంలో వ్యవసాయ శాఖకు ప్రాధాన్యత లేకుండా ఉండేది. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ పెట్టిన దృష్టి మూలన ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వలన వ్యవసాయ శాఖకు మంచి గ్లామర్ వచ్చింది. రానున్న రోజుల్లో ఆధునిక వ్యవసాయం చేసే వరుడు కావాలి అనే రోజులు వస్తాయి.ఆహారానికి ప్రతిమ్నాయం ఏమైనా ఉందా లేదు అందుకే అలాంటి రోజులు వస్తాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.