సినీ గేయ రచయిత వెన్నెలకంటి ఇకలేరు..

24
Lyricist Vennelakanti

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నలకంటి మృతి చెందారు. మంగళవారం గుండెపోటు రావడంతో చెన్నైలో ఆయన కన్నుమూశారు. వెన్నెలకంటి అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎన్నో సినిమాలకు ఆయన ఆణిముత్యాల వంటి పాటలను అందించారు. ఆయన మృతి వార్తతో సిని పరిశ్రమ షాక్ కు గురైంది.సినీ ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన పెద్ద కుమారుడు శశాంక్‌ వెన్నెలకంటి కూడా సినీ డైలాగ్‌ రైటర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు రాకేందు మౌళి లిరిసిస్టుగా, సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్నారు.

ఎస్‌. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్‌ హిట్‌ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్‌ అయ్యాయి. ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్‌, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. డైలాగ్‌ రైటర్‌గా పంచతంత్రం, మొనాలీసా, దశావతారం, ప్రేమ ఖైదీ వంటి తమిళ చిత్రాలకు తెలుగులో డైలాగులు రాశారు.