కొరటాలతో అల్లు అర్జున్‌..!

422
allu arjun
- Advertisement -

సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకుడు కొరటాల శివతో సినిమాలు చేసేందుకు మెగా హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను చిత్రాలతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఖరారు చేయగా కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దేవాలయాల్లో జరిగే అవినీతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కున్నట్లు సమాచారం.

ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్…కొరటాల దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారట.

బన్నీ ఒకడుగు ముందుకేసి కొర‌టాల సినిమా చేసే విష‌య‌మై స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు టీ టౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇదే బాటలో రామ్ చరణ్ కూడా ఉన్నారట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -