అల్లు స్నేహారెడ్డి – జాన్వీ కపూర్… అదే డ్రెస్, అవే అందాలు !

182
- Advertisement -

రోజులు గడిచే కొద్దీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అందాల ఆరబోతలో పరిధి దాటుతుంది. ఈ మధ్య స్నేహారెడ్డి క్రమం తప్పకుండా తన ఎక్స్ పోజింగ్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ను షేక్ చేస్తోంది. అయితే, కొన్ని రోజుల క్రితం, స్నేహారెడ్డి ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ కలెక్షన్ లో భాగంగా డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన స్టైలిష్ గౌను ధరించి నెటిజన్లను అలరించింది. నిజంగానే ఈ గోల్డ్ డ్రెస్‌లో స్నేహారెడ్డి అచ్చం హీరోయిన్ మెటీరియల్ లాగే కనిపించింది. దాంతో ఈ ఫోటోలు అప్పుడు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఉన్నట్టు ఉండి ఈ రోజు ఉదయం నుంచి ఈ ఫోటోలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. దానికి కారణం.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సేమ్ స్నేహారెడ్డి వేసుకున్న డ్రెస్ నే వేసుకుని ఒక ఫోటో షూట్ చేసింది. ఒకే రకం డ్రెస్ లో స్టార్ హీరో సతీమణి క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ మెరిసి పోతుండటం అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు.

దాంతో స్నేహారెడ్డి – జాన్వీ ఫోటోలను ఓ ఫ్రేమ్ లో పెట్టి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ లో తమ హీరోగారి భార్య జాన్వీ కపూర్ తో పోటీ పడుతున్న విధానం చూసి.. మరీ బన్నీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అల్లు అర్జున్ స్నేహారెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి మార్చి 6, 2011 న జరిగింది. పెళ్లి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు అర్హ, అయాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా స్నేహారెడ్డి తన గ్లామర్ తో పై విధంగా హాట్ టాపిక్‌గా మారడం కొసమెరుపు. ఓ దశలో ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇస్తోందని ప్రచారం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అనుకోండి. ఏది ఏమైనా స్నేహారెడ్డి ఫ్యాషన్ ఐకాన్‌ గా స్టైలిష్ డ్రెస్సులు, యాక్సెసరీస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -