పాండ్యా మ‌ళ్లీ ఆ తప్పు చేయడు..

179
Hardhik Pandya Father

బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాత‌గా నిర్వ‌హిస్తున్న కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో టీంఇండియా యువ క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, రాహుల్ లు మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఆ షోలో వారు చేసిన వ్యాఖ్యలు వివాద‌స్ప‌దంగా మారాయి. ఇందుకుగాను వారిని ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న నుంచి బ‌హిష్క‌రించింది బీసీసీఐ.

kl Rahul Hardhik

దింతో సిరీస్ ప్రారంభంకాక‌ముందే తిరిగి ఇంటిముఖం ప‌ట్టారు. ఈవిష‌యంపై తాజాగా స్పందించారు హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు. త‌న కొడుకు ఇంట్లో నుంచి బ‌య‌టకు రావాల‌న్నా భ‌య‌ప‌డిపోతున్నాడ‌ని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్ కు దూరం కావడం పట్ల పాండ్య బాగా అప్‌సెట్ అయ్యాడని తెలిపారు. ఎవ‌రైనా ఫోన్ చేసినా పాండ్యా లిఫ్ట్ చేయ‌డం లేద‌న్నారు.

Hardhik

సంక్రాంతి పండగ రోజు కూడా పాండ్య ఇంట్లో డల్ గానే కూర్చున్నాడన్నారు. సంక్రాంతి పండ‌గ‌కు రోజున ప‌తంగులు ఎగ‌రేయ‌డం అంటే పాండ్యాకు చాలా ఇష్టం అని కానీ ఇప్పుడు డ‌ల్ గా ఇంట్లోనే కూర్చుండిపోయాడ‌ని తెలిపారు. హార్ధిక్ మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోడ‌ని హామి ఇచ్చారు హిమాన్షు.