- Advertisement -
వెయ్యి కోట్ల బడ్జెట్ తో మహా భారతాన్ని తెరకెక్కుతుండగా, ఇప్పుడు మరో పురాణ గాథ రామాయణాన్ని వెండితెరపై 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మాతేన సంయుక్తంగా ఈ సినిమాను త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందిస్తారట. స్వయంగా అరవిందే ఈ విషయాన్ని మీడియాకి ప్రకటించారు.
హాలీవుడ్ స్థాయిలో తీయబోయే ఈ సినిమాను ఆక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభం కానుందని అల్లు అరవింద్ ప్రకటించేశాడు. రామాయణం ప్రపంచానికి తెలిసిన కథే.. కానీ ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు.. హీరో ఎవరు.. క్యాస్టింగ్ ఎవరెవరు.. అనే విషయాలు త్వరలో ప్రకటిస్తామన్నారు అల్లూ సారూ. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
- Advertisement -