సుచీ లీక్స్‌ పార్ట్‌ 2 కూడా ఉందట..!!

204
suchitra part 2 leaks
suchitra part 2 leaks
- Advertisement -

సింగర్‌ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సుచిత్ర.. సినీ స్టార్లకి చెమటలు పట్టించింది. కొలీవుడ్‌ ఇండస్ట్రీని సుచి లీక్స్‌ ఒక్కసారిగా షేక్‌ చేసింది. సుచి ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా లీకైన సెలెబ్రిటీల రొమాన్స్‌ ఫొటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి. సుచిత్ర లీకులనుఆపేందుకు అప్పట్లో భారీ మొత్తాన్నే చదివించుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ పై అప్ డేట్ లేదు.

dd-768x422

ఈ లీక్స్‌తో తనకు ఏ సంబంధం లేదని సుచిత్ర స్పష్టం చేసింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, ఈ పని చేశారని.. వాస్తవానికి ఎవరినీ నొప్పించడానికి తాను ఇష్టపడనని, తన తప్పు కానప్పటికీ… తన వల్ల బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది సుచిత్ర. చెన్నైకి చెందిన ఓ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సుచీ లీక్స్‌ పార్ట్‌ 2 అంటూ కోలీవుడ్ లో హంగామా మొదలైంది. గతంలో ఇదంతా చేసినవాళ్లే.. మళ్లీ బ్లాక్ మెయిలింగ్ కు దిగారని అంటున్నారు.

గతంలో రిలీజ్ చేసినవి మాత్రమే కాకుండా.. ఇంకా చాలానే వీడియోలు.. ఫోటోలు ఉన్నాయని.. ఇంకా డెప్త్ ఉన్న సాక్ష్యాలు కూడా ఉన్నాయని బెదిరిస్తున్నారట. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే చాలా పెద్దమే ఇవ్వాలని బెదిరిస్తున్నారని అంటున్నారు. దీనిపై వాస్తవాలు తెలియవు కానీ.. ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 అనే మాట వినిపించడంతోనే చాలామంది స్టార్లు.. తలలు పట్టుకుంటున్నారట.

- Advertisement -