అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం..

716
allu arjun
- Advertisement -

స్టైలీస్ స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. అల్లు అర్జున్‌ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. ఇది అకాల మరణం. ఆయన తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఓవైపు బన్ని అల వైకుంఠపురములో సక్సెస్ ని ఆస్వాధిస్తున్న వేళ ఊహించని ఈ షాక్ అల్లు కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

అల్లు అర్జున్‌ తల్లి నిర్మలాదేవికి రాజేంద్ర ప్రసాద్‌ అన్నయ్య. మేనమామతో బన్నీ చాలా సన్నిహితంగా ఉండేవారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న బన్నీ సినిమాకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని భావించారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -