అక్కినేని హీరోతో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్‌..!

443

టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఈ సినిమ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతుంది.. ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో అఖిల్ – పూజాల పై ఒక రొమాంటిక్ సాంగ్‌తో పాటు నాలుగు లవ్ సీన్స్ ను చిత్రీకరించారట. లవ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను సమంగా కలిపి అందించడంలో దర్శకుడు భాస్కర్ సిద్ధహస్తుడు. గతంలో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ఫ్యామిలీ జోనర్‌లో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

Pooja-Hegde-

అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో కూడా అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, లవ్ సీన్స్ సినిమా హైలైట్స్ జాబితాలో కనిపిస్తాయని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మనసుకు హత్తుకుపోతాయని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్ ను బాగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అఖిల్‌కు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు మరి ఈ సినిమా అయినా ఈ అక్కినేని అబ్బాయి కలిసివస్తుందో చూడాలి.