‘ఆర్ ఆర్ ఆర్’.. ఆలియా పారితోషకం ఎంతో తెలుసా..?

395
Alia Bhatt

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్ ఆర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి క్రేజీ కాస్టింగ్ అవసరమని భావించిన జక్కన్న అలియాను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, ఆయన జోడీగా అలియా భట్ కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఆలియా అందుకోనున్న పారితోషకం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సినీ వర్గాల సమాచారం. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న కథానాయిక అలియానే అని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా అలియాను చెప్పుకోవచ్చు.