- Advertisement -
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.
బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -