బన్నీ గారాల పట్టి ఫోటో..

604
allu-arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్టమస్ సందర్భంగా తన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు. తన ముద్దుల కూతురి ఫొటోను తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. బన్నీ గారాల పట్టి ముద్దుగా చాలా క్యూట్‌గా ఉంది. అంతేకాదు బన్నీ తన కూతురి పేరు ఏంటో చెప్పేశాడు. తన కూతురు పేరు అర్హా అంటూ అభిమానులకు పరిచయం చేశాడు. తనకు ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించాడు బన్ని. Arjun లో AR, Sneha లో HA లను కలిపి ARHA (అర్హా) అని పేరు పెట్టినట్టుగా వివరించాడు.

ఆర్షా పేరుకు ఉన్న మీనింగ్ కూడా చెప్పాడు. ఆ పేరుకు హైదవంలో శివుడు అని.. ఇస్లాంలో శాంతి, నిర్మలం అనే అర్ధాలు వస్తాయని వివరించాడు. గతంలో క్రిస్టమస్ సందర్భంగా కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ.., ఈ సారి తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. బన్నీతో పాటు మరో యంగ్ హీరో ఆది కూడా తన ముద్దుల కూతురి ఫొటోలతో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

allu-arjun

- Advertisement -