వైభవంగా పండుగలు జరుపుకోవాలి- మంత్రి తలసాని

172
Talasani Srinivas Yadav

ఈ నెల 17న ఉదయం 11:00 గంటలకు నిర్వహించే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ఏర్పట్లను సోమవారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే మన పండుగలకు గర్తింపు లభించిందని ఆయన తెలిపారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి నిర్వహాణ ఖర్చులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పండుగలను వైభవంగా, బ్రహ్మండంగా జరుపుకుంటామని అన్నారు. దాదాపు రెండున్నర లక్షల భక్తులు అమ్మవారి కల్యాణాన్ని తిలకించి, దర్శనం చేసుకునేందుకు వస్తారని తెలిపారు.

Talasani Srinivas Yadav

భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన బార్కేడింగ్‌, క్యూలైన్లు, కళ్యాణమండపం పనులు మంత్రి తనిఖీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతకై రెండు ప్లాటూన్ల మహిళా పోలీసు సిబ్బందిని నియమించినట్లు మంత్రి తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో త్రాగునీటి సదుపాయన్ని కూడా కల్పించామని తెలిపారు. 24 గంటలు పని చేసే విధంగా రెండు బృందాలతో వైద్య శిబిరాన్ని ఏర్పటు చేసినట్లు ఆయన తెలిపారు.

Talasani Srinivas Yadav

బల్కంపేటకు 25 ప్రాంతాల నుండి 125 ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అమ్మవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరికి కనిపించే విధంగా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భక్తుల సౌకర్యర్దం 25 మంది దాతలు అన్నదానాలు చేసేందుకు ముందుకువచ్చారని అక్కడ నీటి వసతిని, విద్యుత్తు సదుపాయాన్ని కల్పించి సానిటేషన్‌ సిబ్బందిని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో జీహెచ్‌యంసీ జోనల్‌ కమీషనర్‌ భారతి హోళికేరి, వాటర్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ అపరేషన్స్‌ కృష్ణ, స్థానిక కార్పోరేటర్‌ శేషుకుమార్‌, దేవస్థానం ఈఓ ఎమ్‌.వి.శర్మ, డీసీపీ విశ్వప్రసాద్‌, రెవెన్యూ, విద్యుత్తు, తదితర శాఖల అధికారులు పాలొన్నారు.

Talasani Srinivas Yadav