క్రిస్మస్‌కి రానున్న పుష్ప..!

187
pushpa
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో ఫస్ట్ పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ వస్తే అది తగ్గడానికి మూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. ఫిల్మ్ నగర్‌లో ఇప్పుడు ఈ వార్త చక్కర్లు కొడుతుండగా త్వరలోనే మేకర్స్‌ అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.

ఇక సెకండ్ వేవ్ తగ్గడంతో తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -