పుష్ప…. నల్గొండలో స్మగ్లింగ్..!

303
pushpa
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.పాన్ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభంకానుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. కథ నేపథ్యంలో షూటింగ్ లో అధిక భాగం అడవిలో తీయాల్సి ఉండగా ప్రస్తుత పరిస్ధితుల్లో వేరే రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ చేయాల్సిన పరిస్ధితి లేదు.

దీంతో నల్గొండ జిల్లాలోని అడవుల్లో సినిమా షూట్ చేయాలని భావిస్తున్నారు సుకుమార్‌. ఇందుకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుండగా తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -