హీరో రామ్ వెరైటీ మాస్క్…సూపర్ అంటున్న ఫ్యాన్స్

279
ram

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్ లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. కరోనా బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. కరోనా కారణంగా ఫేస్ మాస్క్, సానిటైజర్ లు మనలో భాగం అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది.

తాజాగా హీరో రామ్ పొత్తినేని అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓ పత్యేకమైన మాస్క్ ను ధరించి అందరిని ఆలోచింపజేశాడు రామ్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తలను కూడా కప్పివుంచే ప్రత్యేకమైన టీ షర్ట్ ను తయారు చేయించుకుని అతను వేసుకున్నాడు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఇదే తరహా మాస్క్ లను ధరించాలన్నట్టుగా సూచిస్తూ, ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. రామ్ ఐడియా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీలో నటిస్తున్నారు.