ఉండిపోరాదే అంటున్న బన్నీ…

212
allu arjun husharu song
- Advertisement -

కాలేజ్ లైఫ్‌,ఫ్రెండ్స్‌ అంశంగా తెరకెక్కిన మూవీ హుషార్‌. సినిమాతో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండిపోరాదే పాటకు ఫిదా కాని వారుండరు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పాటకు ఫిదా అయ్యారు.

సోషల్‌ మీడియా ద్వారా సింగ‌ర్ సిద్ శ్రీరామ్ , సంగీత ద‌ర్శ‌కుడు ర‌ధ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఉండిపోరాదే అనే సాంగ్ అద్భుతంగా ఉంది. ర‌ధ‌న్ సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ చాలా చ‌క్క‌గా పాడారు అంటూ కామెంట్ పెట్టాడు బ‌న్నీ.చాలారోజుల తర్వాత మంచిసాంగ్‌ని విన్నానని తెలిపారు.ఇప్ప‌టికే ఈ సాంగ్‌ని ప‌లువురు డ‌బ్ స్మాష్ చేస్తుండ‌డంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

ల‌క్కీ మీడియా, ఆసిన్ మూవీ క్రియేష‌న్స్‌, హెచ్‌.కె.ఫిలింస్ బేన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ సినిమాని శ్రీ హ‌ర్ష కొనుగంటి తెర‌కెక్కించారు. ర‌ధ‌న్ చిత్రానికి సంగీతం అందించారు.

- Advertisement -