ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్…పంద్రాగస్టు గిఫ్ట్..!

793
allu arjun
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటివలే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్ధ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ ఏఏ 19వ సినిమా వస్తున్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ , నవదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించనున్నారు బన్నీ.

ఈ సినిమా టైటిల్‌ను పంద్రాగస్టున ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పేర్లు టీటౌన్‌లో చక్కర్లు కొడుతుండగా ఏ టైటిల్‌ని ఖరారు చేస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి హిట్ మూవీలుగా నిలిచాయి. తాజాగా హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -