‘బేబి’ అప్రిసియేషన్ మీట్ కు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి రావాలని బన్నీ పిలుపునిచ్చారు. తెలుగు అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలోకి రావడం లేదని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలోకి వస్తోన్న వైష్ణవి చైతన్య, శ్రీలీల వంటి తెలుగు హీరోయిన్‌లను ప్రేక్షకులు బాగా ఆదరించాలని బన్నీ అన్నారు. ఈ’బేబి’ అప్రిసియేషన్ మీట్ లో బన్నీ ‘పుష్ప 2’పై బిగ్గెస్ట్ లీక్ ఇచ్చాడు.
‘పుష్ప’ లో ‘తగ్గేదేలే’ లెవల్ డైలాగ్ ‘పుష్ప: ది రూల్’లోనూ ఉంటుందని.. సినిమా మొత్తం ఒకదానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బన్నీ డైలాగ్ చెప్తూ.. ‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతా ఉండది.. అది పుష్ప రూల్’ అంటూ బన్నీ డైలాగ్ చెప్పేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు బన్నీ. ప్రస్తుతం ‘పుష్ప 2’ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయినా, ఈ మధ్య స్టార్ హీరోలు తమ సినిమాల డైలాగ్స్ ను వాళ్ళే లీక్ చేస్తున్నారు.
Also Read:కీ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్!
మెగాస్టార్ చిరంజీవి తన భోళా శంకర్ కి సంబంధించిన విషయాలను కూడా చిరు ముందుగానే లీక్ చేస్తూ వస్తున్నారు. ఈ కోవలోనే బన్నీ కూడా తాజాగా తన పుష్ప 2 డైలాగ్ ను లీక్ చేశాడు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. రీసెంట్‌గా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియాతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇక పుష్ప2 సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.
Also Read:రక్తపోటు తగ్గాలంటే?