అల్లు అర్జున్ @ 10 మిలియన్స్‌

231
arjun
- Advertisement -

మెగా ప్రొడ్యూస్ అల్లు అరవింద్ కుమారుడిగా మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో అల్లు అర్జున్‌. తొలి సినిమా గంగోత్రితో ప్రేక్షకులకు దగ్గరైన బన్నీ…వైవిధ్యమైన మూవీలతో తనకంటూ ఓ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. స్టైలీష్ స్టార్‌గా దక్షిణాదిలో ముఖ్యంగా కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగే వేరు. కేరళలలో ముద్దగా మల్లు అర్జున్‌ అని పిలచుకునే ఫ్యాన్స్‌…బన్నీ మూవీ వచ్చిందంటే పండగచేసుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఈ స్టార్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

మాములుగా హీరోలు వారి సినిమాల ప్రమోషన్స్ కు మాత్రం సోషల్ మీడియాకు ఉపయోగిస్తారు. కానీ ఈ అల్లు వారి హీరో తన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు.

తాజాగా అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్స్( కోటికి ) చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. బన్నీ సరసన రష్మీకా హీరోయిన్‌గా నటిస్తుండగా త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -