ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్ ధర.. !

108
petrol

పెట్రోల్ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరాయి. దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ ధర ఏకంగా ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర 29 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.87.59కు చేరాయి. ఇక డీజిల్ ధర రూ.81.17గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.20గా ఉండగా డీజిల్ ధర రూ.74.38గా ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.43గా ఉండగా డీజీల్ ధర రూ.83.53గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.74 శాతం పెరుగుదలతో 54.70 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.85 శాతం పెరుగుదలతో 51.06 డాలర్లకు ఎగసింది.