రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన బన్నీ.. వీడియో వైరల్‌

234
- Advertisement -

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ఫ’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు పార్టులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ కాకినాడలో జరుగుతోంది.. అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూవీ టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా ప్రయాణిస్తున్న అల్లు అర్జున్‌ ఓ చిన్న హోటల్‌ వద్ద ఆగి టిఫిన్‌ చేశారు. సాదాసీదాగా షార్ట్‌తో బయటకొచ్చి సాధారణ హోటల్‌లో టిఫిన్‌ చేశారు.. టిఫిన్‌ చేసిన అనంతరం బన్నీ బిల్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ షాపు యాజమాని వద్దంటూ వారిస్తుండడం, కానీ బన్నీ మాత్రం డబ్బు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి వెళ్లలేదు. అక్కడే ఉన్న కొందరు ఇదంతా వీడియో తీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

- Advertisement -