అల్లు అర్జున్ అర్థిక సాయం.. గోశాల ప్రారంభం..

103
- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామక్షేత్రం శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో సినీ హీరో అల్లు అర్జున్ 2019 సంవత్సరంలో స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయంలో రథశాల గోశాల వాహనశాల ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిమిత్తం సుమారు 20 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఆయన ఇచ్చిన విరాళంతో నిర్మించిన గోశాల, రథశాల, వాహనశాల లను ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్థానికంగా ఉన్న అల్లు వారి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ మరియు పలువురు నాయకులు చిరంజీవి యువత మెగా ఫ్యామిలీ ఫాన్స్ పాల్గొన్నారు.

- Advertisement -