చంద్రయ్య హత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు..

22

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షుడైన తోట చంద్రయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై హ్యత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే చాలా మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశలంలో మాట్లాడుతూ.. చంద్రయ్య హత్యను టీడీపీ, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం. బాబు హయాంలోనే మాచర్ల ప్రాంతంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. బ్రహ్మానందరెడ్డి మళ్ళీ మాచర్ల టీడీపీ ఇన్ చార్జి అయ్యాకే గొడవలు మొదలయ్యాయి. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే పల్నాడులో చంద్రయ్య హత్య, రాజకీయాలకు సంబంధం లేదు. చంద్రయ్య హత్యకు వైయస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం అన్నారు.

ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా హంతుకులపై కఠిన చర్యల తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నాం.. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మేం ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం కాబట్టే, మా కుటుంబాన్ని ప్రజలు 5సార్లు గెలిపించారు. ఎవరు ఎలాంటి వ్యక్తులో, ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలు ఆలోచన చేయాలి అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు.