Pushpa 2:బన్నీ డిస్సపాయింట్ చేశాడా?

19
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ( ది రూల్ ). సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఇక మూవీని ఆగష్టు 15 న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ మూవీ టిజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రా యూనిట్.. అయితే టీజర్ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఒక నిమిషం నిడివి ఉన్న టిజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

ఒక ఫైట్ సీక్వెన్స్ లోని చిన్న క్లిప్స్ ను టిజర్ లా విడుదల చేయడంతో మూవీలోని ఇతర సన్నివేశాలను కూడా టిజర్ లో చూపించి ఉంటే బాగుండనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక టీజర్ లో బన్నీ గెటప్, బాడీ లాంగ్వేజ్ మెస్మరైజ్ గా ఉండడంతో ఆయన అభిమానులు కొంత హ్యాప్పిగానే ఉన్నారు. ఇక పుష్ప మొదటి భాగంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు బన్నీ. దాంతో పుష్ప పార్ట్ 2 ను మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది. ఆగస్టులో ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో పుష్ప పార్ట్ 2 వాయిదా పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో ఆగస్టు 15 అనే మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ మరోసారి కన్ఫర్మ్ చేసింది. మరి పుష్ప పార్ట్ 2 తో అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read:వెంకటేష్ -దిల్ రాజు..ప్రొడక్షన్ నెం 58

- Advertisement -