ఫ్రూటి పట్టిన సరైనోడు….

326
Allu Arjun brand ambassador for Fruti
- Advertisement -

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న క్రేజీ స్టార్ అల్లు అర్జున్ మరోవైపు నిర్మాణ రంగం,యాడ్స్‌ కంపెనీలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు బ్రాండెడ్ కంపెనీల ప్రకటనల్లో మెరుస్తున్న ఈ అల్లువారబ్బాయి తాజాగా ప్రూటీ పట్టారు. భారతదేశంలో మార్కెటింగ్,అమ్మకాలపై దృష్టిసారించిన ప్రముఖ సంస్థ పార్లేకు సంబంధించిన ఫ్రూటీని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

2022 కల్లా వ్యాపారాన్ని రూ.10వేల కోట్ల స్థాయికి పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా అల్లు అర్జున్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘దక్షిణ భారత్‌పై బలమైన దృష్టి సారించాం. ఈ రీజియన్‌లో మార్కెటింగ్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్‌లో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ ఒప్పందం మాకు ఎంతో అవసరం’ అని అల్లు అర్జున్‌ను అంబాసిడర్‌గా నియమించుకోవడంపై పార్లే ఆగ్రో జాయింగ్ ఎండీ, సీఎంవో నాడియా చౌహన్ చెప్పారు. ఉత్తర భారతదేశం తరవాత పార్లే ఆగ్రోకు దక్షిణ భారతం రెండో రెండో అతిపెద్ద మార్కెట్.

పార్లె కంపెనీకి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జునే కావడం విశేషం. ఇప్పటికే క్లోజ్‌అప్, హీరో గ్లామర్, ఓఎల్‌ఎక్స్, హాట్‌స్టార్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేశారు. అంతేగాదు‘రెడ్‌బస్’ ఎక్కి ప్రచారం కూడా చేస్తున్నారు. తాజాగా ఫ్రూటీ తాగమంటూ అందరిముందుకురానున్నారు.

- Advertisement -