‘కలర్ ఫొటో’ బృందానికి అల్లు అర్జున్ అభినందనలు..

181
allu arjun
- Advertisement -

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ‘కలర్ ఫొటో’ చిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇటీవలే ఆహా ఓటీటీ వేదికపై విడుదలైన చిత్రం ‘కలర్ ఫొటో’. ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ నేచురల్ లవ్ స్టోరీలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాదు, విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

ఈనేపథ్యంలో శనివారం ‘కలర్ ఫొటో’ చిత్రబృందం బన్నీని కలిసింది. ఈ సందర్భంగా ఆయన వారిని మెచ్చుకున్నారు. “వెరీ స్వీట్ లవ్ స్టోరీ” అంటూ కొనియాడారు. అద్భుతమైన సంగీతంతో కూడిన ఈ చిత్రం మనసుకు హత్తుకుపోయింది అని పేర్కొన్నారు. నటీనటుల భావోద్వేగాలు, వారి నటన ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలిగిందని బన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

- Advertisement -