రికార్డు సృష్టించిన అల..వైకుంఠపురంలో

352
ala vaikunta puramlo
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అల..వైకుంఠపురంలో. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ ఈనెల 12న విడుదలైంది. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈమూవీ అత్యధిక వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది రికార్డు సృష్టించింది.

అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ కొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇక యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్లు దాటివేసిన ఈ మూవీ $3 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో రూ.15.01 కోట్లు, గుంటూరులో రూ.8.58 కోట్లు, తూర్ప గోదావరిలో రూ.8.12 కోట్లు, కృష్ణాలో రూ.7.40 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.40 కోట్లు, నెల్లూరులో రూ.3.50 కోట్లు సాధించింది. తమన్ సంగీతం అందించిన ఈచిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా కలిసి నిర్మించారు.

- Advertisement -