రెమ్యునరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన రవితేజ..!

508
raviteja
- Advertisement -

అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత మాస్ మహారాజా రవితేజ చేస్తున్న చిత్రం డిస్కో రాజా. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ స్ట్రిక్ట్‌గా ఉంటారని అస్సలు తగ్గడని వార్తలు వెలువడుతుండగా దానిపై క్లిరిటీ ఇచ్చారు. తాను ఎంత పారితోషికానికి అర్హుడినో అంతే రెమ్యునరేషన్ తీసుకుంటానని…అంతకుమించి తక్కువ ఇస్తే ఒప్పుకొనని చెప్పారు. ఒకవేళ నేను అంత మొండివాడినే అయితే నా కెరీర్‌ ఇంతదాకా వచ్చేది కాదన్నారు.తాను నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడంతో ఫైనల్ పేమెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదని… నిర్మాతలు చెక్కులు ఇచ్చిన చెక్కులు చించేశానని చెప్పారు.

వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించగా సునీల్ కీలక పాత్ర పోషించారు.

- Advertisement -