ఇది అల్లువారి మాస్టర్ ప్లాన్..!

91
Allu Aravind's master plan exposed

శాతకర్ణి సినిమాను దెబ్బ తీయదానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.శాతకర్ణి జనవరి 12 న రిలీజ్ కానుంది అని. అటు ఖైదీ ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటి వరకు కాస్త శాతకర్ణిదే పైచేయిగా ఉంది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజులపాటు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం.

అల్లు అరవింద్ మార్క్ పబ్లీసిటీ ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన విషయమే. ఇక అరవింద్ కూడా దీనిని సీరియస్ గా తీసుకుని, సినిమా రిలీజ్ అయిన 3 రోజుల వరకు హై రేంజ్ లో ప్రమోషన్ చేయాలో డిసైడ్ చేశాడట.అంతేకాదు ఖైదీ సినిమాను శాతకర్ణి సినిమా రిలీజ్ కంటే ఒక రోజు ముందే అంటే జనవరి 11నే రిలీజ్ చేయాలని నిర్ణయించాడట. ఇప్పటికే వస్తున్న వార్తల నేపధ్యంలో శాతకర్ణి తరువాత ఖైదీని విడుదల చేస్తే.. మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిరు టీం భావిస్తోంది.

దీంతో తాడోపేడో తేల్చుకోవాలంటే..శాతకర్ణి కంటే ముందే థియేటర్లోకి రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ విషయంలో మెగా ఫ్యామిలీని అల్లు అరవింద్ స్వయంగా ఒప్పించాడట.మరీ,బాక్సాపీస్ వద్ద అల్లు అరవింద్ వ్యూహం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి.