ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల..

95
EC announce assembly poll dates For 5 States

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. యూపీ,పంజాబ్, గోవా మణిపూర్,ఉత్తరాఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘమే ఓటర్ స్లిప్ లను పంపిణి చేస్తుందని ఎన్నికల ప్రధానాధికారి నసీం జైదీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో లక్షా 85 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇవాల్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని..ఐదు రాష్ట్రాల్లో 16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. మార్చి 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

మొదటి సారిగా ఓటర్ స్లిప్‌లపై కలర్ ఫోటోలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.మొత్తం 5 రాష్ట్రాల్లో 690 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 403,పంజాబ్ 117,ఉత్తరాఖండ్ 70,గోవా 40,మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.

గోవా,పంజాబ్‌,ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి అభ్యర్థి విధిగా తన నామినేషన్ పత్రాలపై ఫోటోలను అతికించాలని పేర్కొంది. తాను భారత పౌరుడినేనని డిక్లరేషన్ సమర్పిస్తూ, ఇదే సమయంలో మరే దేశంలోనూ పౌరసత్వం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.  ఇకపై కొత్త ప్రాజెక్టులు, నూతన సంక్షేమ పథకాలను ప్రకటించే వీలు లేదని స్పష్టంగా పేర్కొంది. పారదర్శక విధానంలో ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని, అందుకు ప్రభుత్వాలు, విపక్ష పార్టీలు సహకరించాలని కోరింది.

ఓటు ఎవరికి వేశారో తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు….నోటా ఓటు హక్కును కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. మణిపూర్‌,గోవాలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితి రూ. 20 లక్షలు కాగా యూపీ,పంజాబ్,ఉత్తరాఖండ్‌ అభ్యర్థుల ఎన్నికల  ఖర్చు పరిమితి రూ.28  లక్షలు. కొత్త ఓటర్లకు కూడా ఫోటో గుర్తింపు కార్డులనిచ్చినట్లు తెలిపారు. తొలిసారిగా బ్యాలెట్ పేపర్ పై అభ్యర్ధి ఫోటో ఉండనున్నట్లు నసీం జైదీ తెలిపారు. ఆర్మీ ఉద్యోగులు ఆన్ లైన్ లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

మణిపూర్

రెండు దశల్లో మార్చి 4, మార్చి 8న ఎన్నికలు జరగనున్నాయి
ఫేజ్ 1లో 38 అసెంబ్లీ స్థానాలు
ఫిబ్రవరి 8న నోటిఫికేషన్
నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 15
నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 18
ఎన్నికల తేదీ : మార్చి 4

మణిపూర్ ఫేజ్ 2లో…22 స్ధానాలు

ఫిబ్రవరి 11న నోటిఫికేషన్
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : ఫిబ్రవరి 18
నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 28
నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 22
ఎన్నికల తేదీ: మార్చి 8

గోవా షెడ్యూల్‌

ఎన్నికల తేదీ: ఫిబ్రవ‌రి 4న ఎన్నిక‌లు
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 12
నామినేష‌న్ల దాఖ‌లు చివ‌రి రోజు: జ‌న‌వ‌రి 18
ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి రోజు: జ‌న‌వ‌రి 21

పంజాబ్

ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 4
నామినేషన్ల దాఖలకు చివరి తేదీ:జనవరి 18
నామినేషన్ల పరిశీలన : జనవరి 19
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 21

ఉత్తరాఖండ్

ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 15
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ:జనవరి 28
నామినేషన్ల పరిశీలన:జనవరి 29
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 30

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌

తొలి దశలో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండో దశల్లో 67అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడో దశలో 69 అసెంబ్లీ నియోజకవర్గాలకు, నాలుగో దశలో 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఐదో దశలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఆరో దశలో 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఏడో దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఎన్నికలు జరగనున్నాయి.

ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు….మొత్తం 403 స్థానాలు
తొలి ద‌శ: నోటిఫికేష‌న్ జ‌న‌వ‌రి 17, ఎన్నిక‌లు: ఫిబ్ర‌వ‌రి 11
నామినేష‌న్ చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 24
ఉప‌సంహ‌ర‌ణ‌: జ‌న‌వ‌రి 27

రెండో ద‌శ‌ ఎన్నిక‌లు : ఫిబ్ర‌వ‌రి 15న‌
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 20న‌
నామినేష‌న్ చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 28
ఉప‌సంహర‌ణ‌: జ‌న‌వ‌రి 30

మూడోద‌శ ఎన్నిక‌లు : ఫిబ్ర‌వ‌రి 19న‌
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 24
నామినేష‌న్ల చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 31
ఉప‌సంహ‌ర‌ణ‌: ఫిబ్ర‌వరి 4

నాలుగో ద‌శ ఎన్నిక‌లు : ఫిబ్ర‌వ‌రి 23
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 30
నామినేష‌న్ల చివ‌రి తేదీ: ఫిబ్ర‌వ‌రి 6
ఉప‌సంహ‌ర‌ణ‌: ఫిబ్ర‌వ‌రి 9

ఐదో ద‌శ ఎన్నిక‌లు: ఫిబ్ర‌వ‌రి 27
నోటిఫికేషన్: ఫిబ్రవరి 2
నామినేషన్లు: ఫిబ్రవరి 10
ఉపసంహరణ: ఫిబ్రవరి 13

ఆరో ద‌శ ఎన్నిక‌లు : మార్చి 4
నోటిఫికేషన్ : ఫిబ్రవరి 8
నామినేషన్ : ఫిబ్రవరి 15
ఉపసంహరణ : ఫిబ్రవరి 18

ఏదో ద‌శ ఎన్నిక‌లు : మార్చి 8
నోటిఫికేషన్: ఫిబ్రవరి 11
నామినేషన్లు: ఫిబ్రవరి 18
ఉపసంహరణ: ఫిబ్రవరి 20

యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా… గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీదల్–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి.  2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోడీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది.

2017-election-map-5-states