కిరణ్ మా సొంత మనిషి- అల్లు అరవింద్

56
allu aravind
- Advertisement -

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక పెక్యులర్ పరిస్థితిలో వున్నాం. ప్రతి యంగ్ స్టర్ గుండెల్లో చిన్న భయం వుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమం హైదారాబాద్‌లో గురువారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగా నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల చేయడానికి ముఖ్య కారణం.. కిరణ్ మా గీతా ఆర్ట్స్ సొంత మనిషి. కిరణ్ నటుడు గానే కాకుండా మంచి మనిషిగా నాకు అభిమానం వుంది అన్నారు. నేడు ఇండస్ట్రీలో ఒక పెక్యులర్ పరిస్థితిలో వున్నాం. ప్రతి యంగ్ స్టర్ గుండెల్లో చిన్న భయం వుంది. యంగ్ స్టర్ చిన్న సినిమానే తీస్తాడు. చిన్న సినిమాని థియేటర్లో కి వచ్చి చూస్తారా ? అనే భయం వుంటుంది. అటువంటి తరుణంలో గత వారంలో సినిమాలన్నీ విడుదలై ఆ సినిమాలన్నీ బాగా ఆడుతూ థియేటర్లు లేని సందర్భంలో ఈ సినిమా రిలీజ్ కావడం వెనుక కిరణ్ లాంటి యంగ్ స్టర్ పక్కన మనలాంటోళ్ళం నిలబడితే.. అప్పుడే థియేటర్లు దొరుకుతాయని, థియేటర్స్ తీసుకొని బాగా రిలీజ్ చేసేలాగా వుండాలని ముందుకొచ్చి విడుదల చేస్తున్నాం. అలాగే కొడుకు ప్రతిభని గుర్తించి అతను పైకి రావాలని తల్లితండ్రులే రిస్క్ చేయడం నాకు కొత్తకాదు. గోపీనాథ్ తల్లితండ్రులు కూడా ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. చాందిని లక్కీ హ్యాండ్. ఆమె సినిమాలు కూడా బావుంటాయి. టెక్నికల్ టీం అంతటికి అల్ ది బెస్ట్. అందరూ ఎంతో ఉత్సాహంగా తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ తెలిపారు.

- Advertisement -