- Advertisement -
ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు అల్లు అరవింద్. మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు.
ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని…. అందుకే సమయమనం పాటిస్తున్నాం అన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read:వైభవంగా పీవీ సింధు పెళ్లి సందడి
- Advertisement -