ట్రాఫిక్ పోలీసుల కోసం అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

312
Allu aravind
- Advertisement -

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మండుటెండల్లో నడిరోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆసటగా నిలిచారు. ఎండను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాపిక్ పోలీసులకు, జీహెచ్ ఎంసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణి చేశారు. ఈవిషయాన్ని తన అఫిషియల్ ట్వీట్టర్ ద్వారా షేర్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్ధ.

వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడేందుకు ట్రాఫిక్‌ పోలీసులతోపాటు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఈ బాటిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. మజ్జిగ దాహం తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. యావత్ హైదరాబాద్‌ నగరంలో మేం ఈ మంచి పనిని చేపడుతున్నాం అని ట్వీట్ చేశారు. ఏదిఏమైనా అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -