- Advertisement -
కొంతకాలంగా మెగా ఫ్యామిలీ- అల్లు ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అందుకే వారు కలుసుకోవడం లేదని వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్.
మా రెండు ఫ్యామిలీల మధ్య ఏదో గొడవలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వంద శాతం నిజం లేదు. ఫ్యామిలీలు పెద్దవిగా మారుతున్నాయి. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. ఎవరి స్టార్ డమ్స్ వాళ్లకు వచ్చిన తర్వాత ప్రజల్లోల ఇలా అనుకోవటానికి ఆస్కారం ఉందన్నారు.
అయితే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు కానీ.. వేర్పాట్లు కానీ ఏమీ లేవు. వాళ్ల ఇంట్లో ఏది జరిగినా మేమందరం వెళతాం. అలాగా మా ఇంట్లో ఏం జరిగినా వాళ్లందరూ వస్తారు. పిల్లలు ఎవరి కష్టంతో వారు పైకి వస్తున్నారని తెలిపారు.ఫ్యాన్స్ ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు.
- Advertisement -