బన్నీ సీక్రేట్స్‌ బయట పెట్టిన అల్లు అరవింద్..!

173
allu arjun
- Advertisement -

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ పరువు తీసేశాడు ఆయన తండ్రి అల్లు అరవింద్. ఏంటీ షాక్‌ అవుతున్నారా..? అవును ఇది నిజంగా జరిగింది. అది కూడా హీరోయిన్ సమంత ముందు. అసలు అల్లు అర్జున్ పరువు తీసేంత మాటలు సమంత ముందు అల్లు అరవింద్ ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా..? బన్నీ చిన్నప్పట్టి విషయాల గురించి తెలియని సీక్రేట్‌ మొత్తం చెప్పేశాడు అరవింద్‌. అయితే ఇదంతా స్యామ్ జామ్ షోలో జరిగింది. సమంత హోస్టుగా చేస్తున్న ఈ షోకు చాలా మంది గెస్టులు వస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా వచ్చాడు. మధ్యలో అల్లు అరవింద్ కూడా కాసేపు వచ్చి వెళ్లాడు. ఆహాలో టెలికాస్ట్ అయిన ఈ షోలో చాలా విషయాల గురించి చెప్పాడు అల్లు అర్జున్. దాంతో పాటు సమంత అడిగిన ప్రశ్నలకు అల్లు అరవింద్ కూడా అంతే వేగంగా సమాధానాలు చెప్పాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను కూడా ఆసక్తికరమైన ప్రశ్నలే అడిగింది. అందులో మరీ ముఖ్యంగా బన్నీ చిన్నతనం గురించి అడిగింది ఈ భామ. సమంత అడిగిన ప్రశ్నలకు బన్నీ కూడా అంతే ఆసక్తికరంగా సమాధానాలు చెప్పాడు. ఇప్పుడైతే అల్లు అర్జున్ డిసిప్లైన్, వెరీ ఫోకస్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్.. మరి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు.. బాగా అల్లరి చేసేవాడా.. కామ్‌గా ఉండేవాడా అంటూ సమంత అడిగింది. దానికి అల్లు అరవింద్‌ కొడుకును చూసి దండం పెట్టాడు.

ఆ తర్వాత కొడుకు గురించి చాలా విషయాలు చెప్పాడు ఈయన. ఇప్పుడంటే బన్నీ ఇలా ఉన్నాడు కానీ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు అని చెప్పాడు అల్లు అరవింద్. బన్నీ 11వ తరగతి చదువుతున్నపుడు కాలేజీ ప్రిన్సిపల్ రమ్మన్నారని తనను కాలేజీకి పిలుచుకుని వెళ్లాడని చెప్పాడు అరవింద్. అప్పుడు బన్నీ మార్క్ లిస్ట్ ఇచ్చాడని.. అందులో అన్ని 20, 25 మార్కులే ఉన్నాయని చెప్పాడు. ఆ మార్కులు చూసి ఇక నా పని అయిపోయింది అనుకున్నా. ప్రిన్సిపల్‌తో దొబ్బులు పడతాయి అనుకున్నానని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నాడు. కానీ వెళ్లిన వెంటనే మీరు వెళ్లొచ్చని ప్రిన్సిపాల్ చెప్పడంతో షాక్ అయ్యానని.. ఏంటని అడగటానికి ప్రయత్నిస్తే అప్పుడు బన్నీ చేసిన పని తెలిసిందని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.

వాళ్ల ఫ్రెండ్స్ వచ్చి చెప్తే అసలు విషయం తెలిసిందని చెప్పాడు ఈ నిర్మాత. తనను పిలిచిన ముందు రోజు బన్నీ ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నీకో కూతురుంది.. నేను ఆమెను ప్రేమించొచ్చు.. ఒకవేళ ప్రేమించాక ఏమైనా జరగొచ్చు అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చాడని.. దాంతో భయపడి ప్రిన్సిపాల్ సైలెంట్ అయిపోయాడని చెప్పాడు. అలా చిన్నపుడు చాలానే చేసాడంటూ బన్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు అల్లు అరవింద్. అయితే ఈ మాటలతో బన్నీ పరువు మొత్తం పోయింది. విషయం తెలుసుకుని సమంత కూడా పడిపడి నవ్వేసింది.

- Advertisement -