క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి ప్రతిష్ఠాత్మక ‘పవర్ ఉమెన్’ అవార్డుకు ఎంపికయ్యారు. బెంగళూర్ లోని టౌన్ హాల్ లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లోల దివ్యారెడ్డి ఈ అవార్డును కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్ షెట్టార్ చేతుల మీదుగా అందుకున్నారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆద్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించినవారిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. క్లిమామ్ సహా వ్యపస్థాపకులు అల్లోల గౌతంరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన ఆవుల్ని సంరక్షించుకుకోవడంతో పాటు ముందు తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలనే బలమైన సంకల్పంతో అల్లోల దివ్యారెడ్డి క్లిమామ్ వెల్‌నెస్ ఫార్మ్స్ ప్రారంభించారు.
సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంతో పాటు స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు ఇతర సేవలను క్లిమామ్ అందిస్తుంది. ఐదేండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన క్లిమామ్ వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. క్లిమామ్ పేరుతో దివ్యారెడ్డి అందిస్తున్న సేవలకు గానూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి.