టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన ఓయూ కాంట్రాక్ట్ లెక్చరర్లు..

48
vinod

పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్. అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ మేరకు తమ మద్దతు లేఖను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వారు సోమవారం అందజేశారు.టీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం ఆయా జిల్లాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లు వెల్లడించారు.టీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయమే ఏకైక లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.

మిగతా యూనివర్శిటీ కాంట్రాక్టు లెక్చరర్లు కూడా తమ ఎన్నికల ప్రచార పర్వంలో భాగస్వాములు అవుతున్నారని వారు తెలిపారు.ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డా. వేల్పుల కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాందాస్ నాయక్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటేశ్వర్లు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లు వినోద్ కుమార్ తో సమావేశమై మద్దతు ప్రకటించారు.