సినిమా అనేది రంగుల ప్రపంచం…ఇక తెరపై ఒక్కసారి కనపడితే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని భావించే వారు కోట్లమంది ఉన్నారు. కొంతమంది తమ జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలన్న తాపత్రయంతో ఇండస్ట్రీ చుట్టూ ప్రదక్షణలు చేసే వారు ఉన్నారు. అయితే వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించి తమ జీవితంలో దుఖిఃంచే నటులు కూడా చాలా మంది ఉన్నారు. అంతేకాదు వెండితెరపై కనిపించినా తమ కెరీర్లో ఏమీ సాధించలేదని బాధపడి ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు.
అలా ఆత్మ హత్య చేసుకున వారిలో ఉదయ్ కిరణ్ ఒకడు.. చిన్నగా సిగ్గు పడుతూ చిరునవ్వులు చిందించే ఈ యంగ్ హీరోని మర్చిపోవటం కష్టమే. ఒక తరాన్ని తన ప్రేమ కథలతో ఊపేసారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే కష్టపడి ‘చిత్రం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను, మనసంతా నువ్వే అంటూ వరసపెట్టి హిట్లు కొట్టి, ఆ తర్వాత ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే చనిపోవడానికి కొన్నిరోజులముందు ఉదయ్ చాలా బాధనే అనుభవించాడని చాలా మంది చెప్తారు. అయితే ఆ విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు.
కానీ ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసునంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ముందు రోజు చాలా బాధపడ్డాడని అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ రోజు ఉదయ్ కిరణ్‌ను కలిశానని.. అతని ముఖంలో దిగులు, బాధ కనిపించాయిని. ఎందుకలా ఉన్నావని ప్రశ్నిస్తే.. ఉదయ్ ఇచ్చిన సమాధానంతో అల్లరి నరేష్‌కు మైండ్ బ్లోయింగ్ అనిపించిందట.
పొద్దున్నే ఒక ఆర్టికల్ చదివాను… సినీ ఇండస్ట్రీలో ఏ యువహీరో కథల్ని సరిగా ఎంచుకోవట్లేదని రాసారు. మామూలే ఉదయ్ ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తుంటారు. అవన్నీ పట్టించుకోకు. నీకు సంబంధించిన విషయం కాదు కదా” అన్నాను. లేదు నరేష్ నాకు సంబంధించిన విషయమే అది. ఆ యువ హీరో గురించి రాస్తే రాయొచ్చు. అతను మారకపోతే ఆఖరికి ఉదయకిరణ్ గతే పడుతుంది అని నన్ను ఉదాహరణగా చూపడం బాధిస్తోంది” అన్నాడు.
రంగనాథ్‌గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆత్మహత్య చేసుకోక ముందు ఉదయ్ కిరణ్ నన్ను కలిసుంటే అతన్ని బతికించి ఉండేవాణ్ణి అని. కానీ ఆఖరికి అలా చెప్పిన రంగనాథ్‌గారే ఆత్మహత్య చేసుకోవడం నన్ను కదిలించింది అని అల్లరి నరేష్ వాపోయాడు. నటుల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తల్చుకున్నప్పుడు మనసు పాడవుతుంది. ఈ మధ్య నటుల ఆత్మహత్యలు పెరిగాయి. చాలామంది అవకాశాలు లేక, బయటికి రాలేక కుంగిపోతున్నారు అన్నారు నరేష్.