ఆమె వయసు 36.. బరువు 500 కేజీలు..

276
online news portal
- Advertisement -

కొంత మందిని చూస్తే మనకు బాధకలుగుతుంది. వయసు తక్కువే కానీ భారీ శరీర బరువుతో నానా ఇబ్బందులు పడుతుంటారు. నిర్ణీత స్థాయిని మించి శరీరం బరువు పెరిగితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే అవుతుంది. తాజాగా ఇలాంటి సమస్యను ఈజిప్టుకు చెందిన ఇమాం అహ్మద్ అబ్దులతి ఈ సమస్యను ఎదుర్కొంటుంది.

ఈమె వయసు 36.. అయితే ఆమె బరువు మాత్రం 500ల కిలోలు. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. అధిక బరువు కారణంగా గత 25 ఏళ్ల లో ఒక్కసారి కూడా ఈమె తన ఇంట్లో నుంచి బయటకు రాలేదట. కనీసం బెడ్‌పై నుంచి కూడా కదల్లేని పరిస్థితి. ఆమెకు అన్నం తినిపించడం, బట్టలు మార్చడం, ఇతర పనులను తల్లి, సోదరి చేస్తున్నారు. అబ్దులాతి పుట్టుకతోనే 5 కేజీల బరువు.

అయితే శరీరావయవాలను విపరీతంగా ఉబ్బిపోయేలా చేసే ”ఎలిఫెంటాసిన్” వల్లనే ఆమె కొండంత లావు పెరగడానికి మూలకారణమని కుటుంబసభ్యులు అంటున్నారు. చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న అబ్దులాతి బరువు పెద్దయ్యే సమయానికి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్కూలుకు కూడా వెళ్లలేకపోయేదట.

అబ్దులాతి శరీరంలో ఓ వైపంతా చచ్చుపడిపోయింది. దీంతో అబ్దులాతి మంచానికే పరిమితమైపోయింది. ఇప్పటిదాకా అబ్దులాతితో ఎలాగోలా తంటాలు పడి…నెట్టుకొచ్చిన ఆమె కుటుంబం ఇప్పుడు సాయం కోసం అర్ధిస్తూ…ప్రజల ముందుకొచ్చింది. రోజురోజుకూ బరువుపెరిగిపోతున్న అబ్దులాతికు కనీసం ఈ స్థితిలో నైనా అత్యవసర శస్త్రచికిత్స చేయించాలని కుంటుంబ సభ్యులు ఈజిప్టు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

- Advertisement -