TVK:ప్రభుత్వ ఏర్పాటుకు డేట్ ఫిక్స్!

5
- Advertisement -

2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు (మెజారిటీ మార్కు) 10 సీట్లు తక్కువ కావడంతో, మిత్రపక్షాల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) మంగళవారం రాత్రి జరిపిన వర్చువల్ సమావేశంలో విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 సీట్లు ఇప్పుడు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానున్నాయి.

కాంగ్రెస్ ఒక ప్రధాన షరతు విధించింది. విజయ్ ప్రభుత్వం బీజేపీ (ఒక్క సీటు గెలిచింది) లేదా బీజేపీ అనుబంధ పార్టీల మద్దతు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఒక ‘సెక్యులర్’ ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మద్దతుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ 2 క్యాబినెట్ పదవులతో పాటు కొన్ని ప్రభుత్వ బోర్డుల ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇవాళ విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరే (Stake claim) అవకాశం ఉంది. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయన కొంత సమయం కోరవచ్చు. సీపీఎం (CPI-M) తో చర్చలు: మరో రెండు సీట్లు గెలుచుకున్న సీపీఎం పార్టీని కూడా టీవీకే వ్యూహకర్తలు సంప్రదించారు. ఆ పార్టీ తన నిర్ణయాన్ని మే 8న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో వెల్లడించనుంది.

ప్రస్తుతం టీవీకే (108) + కాంగ్రెస్ (5) కలిపినా 113 సీట్లు మాత్రమే అవుతున్నాయి. మెజారిటీ మార్కు (118) అందుకోవడానికి మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అవసరం. ఈ నేపథ్యంలో స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయంపై డీఎంకే (DMK) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దశాబ్దాల మిత్రపక్షాన్ని కాదని విజయ్ వైపు వెళ్లడం ‘వెన్నుపోటు’ అని డీఎంకే ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

Also Read:‘హిట్‌మ్యాన్‌’పై ప్రశంసల జల్లు!

- Advertisement -