లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ ఆడే ఇన్నింగ్స్‌లు కేవలం పరుగుల కోసమే కాకుండా, జట్టు విజయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని గవాస్కర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో రోహిత్ ఇచ్చే ఆరంభం తర్వాతి బ్యాటర్లకు పని సులువు చేస్తుందని కొనియాడారు. రోహిత్ 30 లేదా 40 పరుగులు చేసినా, అవి చాలా వేగంగా వస్తాయి. ఆ పరుగులు ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆయన నాక్స్ ఎప్పుడూ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటాయి అని గవాస్కర్ విశ్లేషించారు.
లక్నో బౌలర్లపై రోహిత్ ఆడిన కొన్ని షాట్లు ఆయనలోని క్లాస్‌ను ప్రతిబింబించాయని, వయసు పెరుగుతున్నా ఆయన బ్యాటింగ్ శైలిలో పదును తగ్గలేదని గవాస్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ నిలకడగా రాణించాలంటే రోహిత్ ఫామ్ అత్యంత కీలకమని, ఆయన ఫామ్‌లో ఉంటే ముంబైని అడ్డుకోవడం ఎవరికైనా కష్టమేనని మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు.
Also Read:గోదారి గట్టుపైన..ఎంజాయ్ చేస్తారు!
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, ఐపీఎల్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకున్నారు. రోహిత్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న తరుణంలో గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

