నల్గొండ ఎమ్మెల్సీ పోలింగ్..ఏర్పాట్లు పూర్తి

330
nalgonda mlc
- Advertisement -

నల్లగొండ జిల్లా స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పొలింగ్ కేంద్రాలనుఏర్పాటు చేయాగా, మెత్తం 1086 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 811 ఎంపీటీసీ ఓటర్లు,
57 జెడ్పీటీసీ ఓటర్లు,208 మున్సిపల్ కౌన్సిలర్ ఓటర్లు,10 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యుల ఓటర్లు ఉన్నారు..

నల్లగొండ,దేవరకొండ,మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి,చౌటుప్పల్ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. డివిజన్ పరిధిలో ఉన్న ఓటర్లు అక్కడికి వచ్చి తమ ఓటును వినియమోగించుకోవాలి,మేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.

రిటర్నింగ్ అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు..అటు పోలీస్ శాఖ కూడా పటిష్టమైన భద్రత చర్యల్ని చేపట్టింది. ఓటర్లకు ప్రత్యేకమైన కార్డ్స్ ను అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన గుర్తింపు కార్డ్ తెచ్చుకోవాల్సిందిగా అధకారులు కోరారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సరళిని మెత్తాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యక్షిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.పోలింగ్ అనంతరం ఆయా డివిజన్ కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను నుంచి బ్యాలెట్ బాక్స్ లను నల్లగొండ పట్టణంలోని ఎఫ్ సీఐ గౌడౌన్స్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ కు రూంకు తరలిస్తారు. జూన్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు.

- Advertisement -