విజయమ్మ భావోద్వేగం..కన్నీళ్లు తుడిచిన జగన్‌

261
jagan vijayamma

నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్‌ పెంపు ఫైలుపై మొదటి సంతకం పెట్టారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల పథకాలను తూచా తప్పకుండా పాటిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న సమయంలో విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొడుకు తొలి ప్రసంగం చేసిన కొడుకుని చూసి ఆనందబాష్పాలు రాల్చారు. జగన్‌ను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. తల్లిని అక్కున చేర్చుకున్న జగన్ ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. అనంతరం అమ్మను తీసుకుని వేదిక పైనుంచి కిందికి తీసుకుని వెళ్ళారు. అభివాదం చేస్తూ జగన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి వెళ్లారు