లైగర్‌ ట్రైలర్…భారీ హైప్!

64
vijay
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు.

జూలై 21న ఉదయం 9.30 గంటలకు రిలీజ్ చేసేందుకు లైగర్ చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ట్రైలర్‌ను తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లు ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

విజయ్ దేరవకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

- Advertisement -